భారత వృద్ధిలో, అంతర్జాతీయంగా దేశానికి గౌరవాన్ని పెంపొందింప చేయడంలో ప్రైవేటు రంగానిది చాలా కీలకమైన పాత్ర అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొనడాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. ప్రభుత్వ అంచనాలను పరిశ్రమ అందుకోవాలని పేర్కొన్నారు.
"సంపద పంపిణీకి సృష్టికర్తలు చాలా కీలకం. పార్లమెంట్‌లో ప్రైవేట్ రంగ పాత్రను ప్రధానమంత్రి గుర్తించడంతో ప్రతి వ్యాపారవేత్త ఆత్మవిశ్వాసం పెరిగింది"
- ఉదయ్ కోటక్, సీఐఐ అధ్యక్షుడు
"ప్రధాన మంత్రి వ్యాఖ్యలు గొప్ప ప్రోత్సాహన్ని ఇచ్చాయి. దేశంలో సంపద, ఉద్యోగాలు సృష్టిస్తున్న వారిని గుర్తించడం సంతోషకరం. పనితీరు పరంగా అంచనాలు అందుకోవాల్సి ఉంది."