తెలంగాణ

telangana

ETV Bharat / business

జులైలో 4.3 శాతానికి తగ్గిన పారిశ్రామికోత్పత్తి - పారిశ్రమికోత్పత్తి

తయారీ రంగ సంక్షోభంతో ఈ ఏడాది జులైలో పారిశ్రామికోత్పత్తి రేటు 4.3 శాతానికి క్షీణించింది. ఇతర రంగాలతో పోలిస్తే మైనింగ్​ రంగంలో ఉత్పత్తి రేటు గణనీయంగా పెరిగింది.

పారిశ్రామికోత్పత్తి

By

Published : Sep 12, 2019, 6:57 PM IST

Updated : Sep 30, 2019, 9:12 AM IST

దేశాన్ని ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముతున్నాయి. ఇటీవల పరిణామాలు చూస్తే ఇది నిజమేననిపిస్తోంది.

తయారీ రంగంలో నెలకొన్న క్షీణత మూలంగా జూలైలో పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 4.3 శాతానికి తగ్గింది. గతేడాది 6.5 శాతంగా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తితో పోలిస్తే..ఈ ఏడాది జులైలో 2.2 శాతం తగ్గిందని..కేంద్ర గణాంకాల విభాగం ప్రకటించింది. ఈ ఏడాది మేలో 4.6శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి వృద్ధి జూన్‌లో 1.2 శాతంగా నమోదైనట్లు తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జులై త్రైమాసికంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 3.3 శాతంగా ఉండగా.. గతేడాది ఇదే తొలి త్రైమాసికంలకో ఐఐపీ 5.4శాతంగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలిసింది.
తయారీ రంగంలో గతేడాది 7 శాతం ఉన్న వృద్ధి రేటు.. ఈ ఏడాది జులైలో 4.2శాతానికి క్షీణించింది.

ఇతర రంగాలతో పోలిస్తే.. మైనింగ్​ రంగంలో ఐఐపీ జులైలో 4.9 శాతానికి వృద్ధి చెందింది. గత ఏడాది జులైలో ఇది 3.4 శాతంగా ఉంది.

విద్యుత్​ రంగంలో ఉత్పాదన..ఈ ఏడాది జులైలో 4.8 శాతానికి తగ్గింది. 2018 జులైలో ఇది 6.6 శాతంగా ఉంది.

ఇదీ చూడండి: చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదల

Last Updated : Sep 30, 2019, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details