తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇండిగో ప్రయాణికులకు ఒక్కరికే రెండు సీట్లు! - ఇండిగో ఒకే ప్యాసింజర్​కు రెండు సీట్లు

కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల విమాన ప్రయాణాలు భారీగా తగ్గాయి. ప్రయాణికులను ఆకర్షించేందుకు బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్​లైన్స్ ఒక ప్రయాణికుడే రెండు సీట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇండిగో ఇందుకు కొన్ని నిబంధనలు విధించింది.. అవి ఇలా ఉన్నాయి.

indigo new offer
ఇండిగో కొత్త ఆఫర్

By

Published : Jul 17, 2020, 5:33 PM IST

Updated : Jul 17, 2020, 5:54 PM IST

దేశంలో కరోనా విజృంభణతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. కొందరు తప్పనిసరైతేనే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే, ప్రయాణాల్లో భౌతిక దూరం ఉండదన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు కొత్త సదుపాయం అందిస్తోంది. భౌతిక దూరం పాటించాలనుకునే ప్రయాణికుడు రెండు సీట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. జులై 24 నుంచి దీన్ని ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.

25 శాతం అదనం..

ఇండిగో వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే వారికి మాత్రమే '6ఈ డబుల్ సీట్‌' పేరిట తీసుకొస్తున్న ఈ స్కీమ్‌ వర్తిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. అదనపు సీటుకు వాస్తవ ధర కంటే 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రయాణానికి 24 గంటల ముందు కూడా డబుల్‌ సీట్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రయాణికుడికి ఆనుకుని ఉన్న సీట్‌ను మాత్రమే బుక్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇటీవల విమాన ప్రయాణంపై నిర్వహించిన ఓ సర్వేలో భౌతిక దూరం పట్ల పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ స్కీమ్‌ను పరిచయం చేసింది ఇండిగో.

గో ఎయిర్ క్వారంటైన్ ప్యాకేజ్​..

దేశీయ విమానయాన సంస్థ​ 'గో ఎయిర్' తమ ప్రయాణికుల కోసం క్వారంటైన్ ప్యాకేజీలను ప్రకటించింది.​

దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు.. ఎంపిక చేసిన నగరాల్లోని హోటళ్లలో బడ్జెట్​ నుంచి హై-ఎండ్ వరకు క్వారంటైన్ ప్యాకేజీలు అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రారంభ ప్యాకేజీ రూ.1,400తో ప్రారంభమవుతుందని వెల్లడించింది.

ఇదీ చూడండి:ధీమా ఇచ్చే బీమా రంగంపై కరోనా కాటు!

Last Updated : Jul 17, 2020, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details