IndiGo Rakesh Gangwal Resigns: ప్రైవేటు విమానాయాన సంస్థ ఇండిగో సహ-వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ ఎయిర్‌లైన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన పదవులకు రాజీనామా చేశారు. తద్వారా ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్లోని నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పదవుల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరో ప్రమోటర్ రాహుల్ బాటియాతో ఏర్పడిన విభేదాల వల్లే బోర్డు నుంచి రాకేశ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇండిగో సహవ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ రాజీనామా.. అదే కారణమా? - ఇండిగో డైరెక్టర్ రాకేశ్ గంగ్వార్ రాజీనామా
IndiGo Rakesh Gangwal Resigns: భారత్‌లో ప్రముఖ విమానయాన కంపెనీ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో తన పదవులకు రాజీనామా చేశారు సహవ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్. తద్వారా తక్షణమే కంపెనీ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మరోవైపు తన వాటాల్ని కూడా ఉపసంహరించుకోనున్నట్లు బోర్డు రాసిన లేఖలో వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో ఇంటర్‌గ్లోబ్ నుంచి తన వాటాల్ని క్రమంగా తగ్గించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీలో రాకేశ్, ఆయన సంబంధిత సంస్థలకు 37 శాతం వాటా ఉంది. 15 ఏళ్ల నుంచి కంపెనీలో వాటాదారుగా ఉన్నట్లు తెలిపిన రాకేశ్.. ఏదో ఒకరోజు వాటాలను వెనక్కి తీసుకోవటం సహజమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఎయిర్‌లైన్స్ బోర్డు సభ్యుడిగా చేరే అంశాన్ని పరిశీలించనున్నట్లు రాకేశ్ గంగ్వాల్ సంకేతాలు ఇచ్చారు.
ఇదీ చూడండి:LIC IPO Date: ఎల్‌ఐసీ ఐపీఓ ఇష్యూకు వచ్చేది ఆ రోజే!