భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఏటేటా గణనీయ వృద్ధి సాధిస్తూ దూసుకెళ్తోంది. 2019లో 8 శాతం వృద్ధిని నమోదు చేసిన భారత్.. ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించినట్లు ప్రముఖ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. 2020లో కూడా ఇదే తరహాలో వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నట్లు ఐడీసీ పేర్కొంది.
ఐడీసీ డేటా ప్రకారం.. 2019లో మొత్తంగా 282.9 మిలియన్ల మొబైల్ ఫోన్లు విక్రయమైనట్లు తెలిసింది.
కంపెనీల వారీగా..
షియోమీవి 43.6 మిలియన్ యూనిట్లు విక్రయించింది. మరే ఇతర సంస్థకు సాధ్యంకానంతగా 2019లో ఈ సంస్థ 9.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ వాటా వాటా 28.6 శాతంగా ఉంది. శాంసంగ్ (20.3 శాతం), వివో (15.6 శాతం), ఒప్పో (10.7) శాతం, రియల్ మీ (10.6) శాతం మార్కెట్ వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 36.9 మిలియన్ యూనిట్ల స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్‌తో 5.5 శాతం వృద్ధి నమోదైంది. కానీ గత త్రైమాసికంతో పోల్చితే 20.8 శాతం తగ్గుదల నమోదు అయింది.