తెలంగాణ

telangana

ETV Bharat / business

2023 నాటికి దేశంలో 90.7 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు! - ఇండియాలో మొబైల్ ఫోన్​ వినియోగదారుల సంఖ్య

భారత్​లో 2023 నాటికి ఇంటర్నెట్​ వాడే వారి సంఖ్య 907 మిలియన్ల (90.7 కోట్లు)కు చేరుతుందని సిస్కో నివేదికలో తేలింది. ఇదే సమయంలో మొత్తం మొబైల్​ ఫోన్లు వాడే వారి సంఖ్య 966 మిలియన్లకు చేరుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.

INDIAS INTERNET USER BASE
ఇండియా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య

By

Published : Feb 19, 2020, 7:39 AM IST

Updated : Mar 1, 2020, 7:24 PM IST

మరికొన్నేళ్లలో భారత్​లో ఇంటర్నెట్​ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రముఖ హార్డ్​వేర్​ దిగ్గజం సిస్కో నివేదిక తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం 2018లో 398 (దేశ జనాభాలో 29 శాతం) మిలియన్లుగా ఉన్న ఇంటర్నెట్​ వినియోగదారుల సంఖ్య.. 2023 నాటికి 907 ( దేశ జనాభాలో 68 శాతం) మిలియన్లకు చేరుతుంది.

మొబైల్ యూజర్లు 2018లో 763 మిలియన్లు (దేశ జనాభాలో 56 శాతం)గా ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 966 మిలియన్ల (దేశ జనాభాలో 68 శాతం)కు చేరుతుంది. ఇదే సమయంలో ప్రతి 20 మందిలో ఒకరు 5జీ సాంకేతికతను వినియోగిస్తారు. వీరి సంఖ్య 67.2 మిలియన్లుగా ఉంటుందని సిస్కో నివేదిక పేర్కొంది.

భారత్​లో జనాభా కంటే డివైజ్​లు, కనెక్షన్లు వేగంగా వృద్ధి చెందుతున్నట్లు సిస్కో నివేదిక తెలిపింది. ఈ ధోరణి డివైజ్​ల సంఖ్య భారీగా పెరిగేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 'ఆల్ ఇన్ వన్' యాప్..!

Last Updated : Mar 1, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details