ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 5 శాతానికి తగ్గించింది ఎస్బీఐ. ఇంతకు ముందు ఎస్బీఐ విడుదల చేసిన నివేదికలో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనా వేయడం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి 4.2 శాతానికే పరిమితమవుతుందని ఎస్బీఐ తాజా నివేదికలో పేర్కొంది. వాహన రంగ సంక్షోభం, కీలక రంగాల్లో నెలకొన్న స్తబ్దత, నిర్మాణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది.
2019-20 తొలి త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠం వద్ద 5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే.