దేశ ఆర్థిక వృద్ధి ఆశించిన దానికంటే ఇంకా తక్కువగా నమోదవుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వెల్లడించింది. కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ అనిశ్చితులకు తోడు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సంక్షోభం ఇందుకు ప్రధాన కారణంగా ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి 5 శాతంగా మాత్రమే నమోదుకావడంపై ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఆరేళ్లలో ఇంత తక్కువ వృద్ధి నమోదు కావడం ఇదే ప్రథమమని గుర్తుచేసింది.