ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆర్ధభాగం చివరి నాటికి(సెప్టెంబర్) విదేశీ మారకం నిల్వలు 5 శాతం పెరిగినట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 2019-20 తొలి అర్ధభాగం చివరినాటికి విదేశీ మారకం నిల్వలు మొత్తం 433.70 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. 2019 మార్చి చివరి నాటికి ఈ నిల్వలు 412.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
పారదర్శకతను పెంచే ప్రయత్నంలో భాగంగా.. అర్ధవార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది ఆర్బీఐ.
బంగారం నిల్వల లెక్క ఇది..
ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి రిజర్వు బ్యాంకు వద్ద 618.17 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇందులో 325.87 టన్నులు సురక్షిత కస్టడీ కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉన్నాయి. మిగతా మొత్తం దేశీయంగా నిల్వ ఉంది.
మొత్తం విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా.. 2019 మార్చిలో 5.6 శాతంగా ఉండగా సెప్టెంబర్ చివరి నాటికి 6.1 శాతానికి పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఇదీ చూడండి:'బ్యాంకు ఖాతాల కోసం మతం చెప్పాల్సిన పని లేదు'