తెలంగాణ

telangana

ETV Bharat / business

'ముకేశ్‌ జీ రండి.. చైనా వస్తువులను బహిష్కరిద్దాం'

సరిహద్దులో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ వస్తువులను బహిష్కరించాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్ ముకేశ్​ అంబానీకి అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య( కెయిట్​ )లేఖ రాసింది. ఈ ప్రచారానికి మద్దతుగా నిలవాలని రతన్​ టాటా, అజీమ్​ ప్రేమ్​.. వంటి పారిశ్రామికవేత్తలనూ కోరింది.

Indian trade unions Writes to Mukesh Ambani
ముకేశ్‌ జీ.. చైనా వస్తువులను బహిష్కరిద్దాం

By

Published : Jun 25, 2020, 6:41 AM IST

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా ఆకస్మికంగా దాడిచేసి 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ‘భారత్‌ సామాన్‌- హమారా అభిమాన్‌’ అంటూ చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారమూ ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీకి అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య (కెయిట్‌) లేఖ రాసింది.

చైనాపై సైన్యంతోనే కాదు ఆర్థికంగా కూడా తిరిగి దాడి చేయాలనే భావన భారతీయుల్లో గట్టిగా ఉందని ముకేశ్‌కు రాసిన లేఖలో కెయిట్‌ తెలిపింది. 'భారత దేశానికి మీరు, మీ సంస్థ ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వచ్చిన విషయం మాకు తెలుసు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని చాటి చెప్పేందుకు ఇది మీకు మంచి అవకాశం. ప్రచార కార్యక్రమంలో మీరు పాల్గొని మద్దతు తెలిపితే మిగిలిన పారిశ్రామికవేత్తలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తారు'అని వెల్లడించింది. మీ నిర్ణయంతో ఈ ప్రచార కార్యక్రమానికి బలం చేకూరడమే కాదు మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఘన నివాళి అర్పించినట్లు అవుతుంద’ని లేఖలో కెయిట్‌ పేర్కొంది.

ప్రముఖ పారిశ్రామికావేత్తలనూ..

చైనా వస్తువుల బహిష్కరణకు మద్దతు తెలపాలని మరో 50 మంది ఇతర పారిశ్రామికవేత్తలను కూడా కోరింది కెయిట్​. వీరిలో రతన్‌ టాటా, అజీమ్‌ ప్రేమ్‌, గౌతమ్‌ అదానీ, అజయ్‌ పిరమాల్‌, ఆనంద్‌ మహీంద్రా, కుమార్‌ మంగళం బిర్లా, విక్రమ్‌ కిర్లోస్కర్‌, రాహుల్‌ బజాజ్‌, శివ్‌ నాడార్‌, పల్లోంజి మిస్త్రీ, ఉదయ్‌ కోటక్‌, నుస్లి వాడియా, శశి రుయా, మధుకర్‌ పరేఖ్‌, హర్స్‌మరివాలా, సతీశ్‌ రెడ్డి, పంకజ్‌ పటేల్‌ తదితర ప్రముఖలు ఉన్నారు.

ఇదీ చూడండి: చైనాకు వ్యతిరేకంగా కెనడాలో ఎన్​ఆర్​ఐల నిరసన

ABOUT THE AUTHOR

...view details