తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 6:20 AM IST

ETV Bharat / business

ఈ వెంటిలేటర్​ వినియోగిస్తే వైరస్​ ఖతమే..!

కరోనా మహమ్మారి చికిత్సలో వెంటిలేటర్లు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతితక్కువ ధరకే వెంటిలేటర్​ను అభివృద్ధి చేసింది ఐఐటీ కాన్పూర్​ ఆధ్వర్యంలోని అంకుర సంస్థ నోకా రోబోటిక్స్​. దిగుమతి చేసుకుంటున్న వెంటిలేటర్లతో పోలిస్తే వీటి ధర పదో వంతు మాత్రమే ఉంటుందని తెలిపింది.  వాటిలో లేని వైరస్​ను చంపే ఫిల్టర్​ ఛాంబర్​లు తమ వెంటిలేటర్​లో ప్రత్యేకమని వెల్లడించింది.

ventilator
వైరస్​ను చంపే ఫిల్టర్​​ ఛాంబర్​తో వెంటిలేటర్ రూపకల్పన​!

కరోనా వైరస్​ రోగుల కోసం ఐసీయూ-గ్రేడ్​ వెంటిలేటర్​ను అభివృద్ధి చేసింది ఐఐటీ కాన్పూర్​ ఆధ్వర్యంలోని స్టార్టప్​ నోకా రోబోటిక్స్​​. దీని ధర విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వెంటిలేటర్లతో పోలిస్తే పదో వంతు ఉంటుందని వెల్లడించింది.

దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వెంటిలేటర్లను ఈనెల చివరి నాటికి లేదా.. జూన్​ మొదటి వారానికి డెలివరీ ప్రారంభిస్తామని తెలిపారు సంస్థ సహ వ్యవస్థాపకుడు అమితభ బంద్యోపధ్యాయ​.

" దేశం కోసం లాభాపేక్ష లేని వెంటిలేటర్ల తయారీ కోసం ఐఐటీ కాన్పూర్​, నోకా రోబోటిక్స్​.. ప్రభుత్వ రంగ సంస్థ భారత్​ డైనమిక్స్​తో ఒప్పందం చేసుకున్నాయి. వీటి ధర ఒక్కోయూనిట్​కు సుమారుగా రూ.1.5 లక్షలుగా ఉంటుందని ముందుగా అంచనా వేశాం. దిగుమతి చేసుకుంటున్న వెంటిలేటర్ల ధర రూ.8 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 25 లక్షల వరకు ఉంటోంది. జులై చివరి నాటికి 10వేల యూనిట్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. డిమాండ్​ ఎక్కువగా ఉంటే ఆగస్టు నాటికి 30వేల యూనిట్లకు పెంచుతాం."

– అమితభ బంద్యోపధ్యాయ​

వైరస్​ను చంపే ఫిల్టర్లు..ప్రత్యేకం

ఆరోగ్య సిబ్బంది భద్రత, రక్షణే తమ సంస్థ ప్రథమ ప్రాధాన్యంగా వైరస్​ను చంపే ఫిల్టర్​ ఛాంబర్​తో వెంటిలేటర్​ను రూపొందించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్​ కురెల్​ తెలిపారు.

" కరోనా​ సోకిన వ్యక్తి వెంటిలేటర్​పై శ్వాస తీసుకుంటున్నప్పుడు.. వైరస్​తో నిండిన గాలిని బయటికి వదులుతాడు. ఐసీయూ మొత్తం వైరస్​తో నిండిపోతుంది. అది వైద్య సిబ్బందికి చాలా ప్రమాదకరం. మా వెంటిలేటర్​లో ఆల్ట్రావైలెట్​ ఫిల్టర్​ ఛాంబర్స్​ను ఏర్పాటు చేశాం. అది వైరస్​ను చంపి.. గాలిని శుభ్రపరుస్తుంది. దేశీయ అవసరాలు, కరోనా వైరస్​ నుంచి ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకుని వెంటిలేటర్​ రూపొందించేందుకు బోర్డులో డాక్టర్లు, వైద్య నిపుణులను చేర్చుకున్నాం. పెద్ద పెద్ద ఆస్పత్రులు ఎక్కువగా ఉపయోగించే 5-6 ఉన్నత స్థాయి వెంటిలేటర్లను పరిశీలించినప్పుడు వాటిలో ఫిల్టర్లు లేవని గుర్తించాం. మా వెంటిలేటర్లను ఐసీయూతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వినియోగించొచ్చు. "

– నిఖిల్​ కురెల్​, సహ వ్యవస్థాపకుడు.

నోకా రోబోటిక్స్​ అభివృద్ధి చేసిన వెంటిలేటర్​ను ఎక్కడికైనా తీసుకెళ్లేలా రూపొందించినట్లు తెలిపారు కురెల్​. బ్యాటరీతో సుమారు 4 గంటల పాటు పని చేస్తుందని తెలిపారు. ఈ వెంటిలేటర్ల పనితీరును మే 12 నుంచి పుణెలోని ఆస్పత్రిలో పరీక్షించనున్నట్లు చెప్పారు కురెల్​. వీటిపై యూఎల్​, టీయూవీ పరీక్షలూ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details