ఉద్యోగం లేక... ఉన్న జీతాలు చాలక కష్టంగా బతుకీడుస్తున్న సమయంలో వచ్చిన ఓ వ్యాపారాలోచనలకు జీవం పోసి.. యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు కొందరు భారత యువకులు. ఇది వర్కవుట్ అయ్యేపని కాదని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా.. వెనకడుగు వేయకుండా అంకుర సంస్థలు స్థాపించి ప్రపంచ ధనవంతుల జాబితాలో చేరిపోయిన ఆ స్టార్టప్ యజమానల విజయగాథలు ఇవి...
- 1. రితేశ్ అగర్వాల్ - ఓయో
ఇప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్లినా హోటల్ రూమ్స్ కోసం లగేజీ పట్టుకుని తిరగకుండా.. ఫోన్లోనే బుక్ చేసుకుంటున్నాం. ఈ సౌలభ్యం మనకు పరిచయం చేసింది రితేశ్ అగర్వాల్. ఈ 26 ఏళ్ల భారతీయుడు.. విద్యార్థి దశలో ఉన్నప్పుడు.. తండ్రి పంపిన పాకెట్‌మనీతో ఓయో రూమ్స్ స్థాపించాడు. క్రమంగా భారత దేశవ్యాప్తంగా.. ఆ తర్వాత అమెరికాలోనూ ఈ వ్యాపారాన్ని విస్తరించాడు. ఇప్పుడు రూ.7500 కోట్లకు అధిపతయ్యాడు.
- 2.అంకిత్ భాటి- ఓలా
ఆటోలు, ట్యాక్సీల కోసం ఎదురు చూసి చూసి, తీరా దొరికాక ఆ డ్రైవర్లతో బేరం ఆడలేక.. కాలినడకన వెళ్లలేక పడ్డ తిప్పలను దూరం చేసింది ఓలా. ఆన్లైన్లో బుక్‌చేసుకుంటే.. మీరున్న చోటుకే వచ్చి, బేరసారాలు లేకుండా గమ్యాన్ని చేరితే బాగుండు అనుకుని... ఓలా క్యాబ్స్ స్థాపించాడు అంకిత్ భాటి(33). ఆ ఒక్క ఆలోచనే ఇప్పుడు అంకిత్‌ను రూ.1400 కోట్లకు అధిపతిగా మార్చింది.
- 3. శ్రీ హర్ష మాజేటి- స్విగ్గీ