రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి'కు భారత్ అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వడంపై రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. స్పుత్నిక్-వి టీకాకు అనుమతినిచ్చిన 60వ దేశంగా భారత్ నిలిచినట్లు తెలిపింది.
24 గంటల్లోపే ఆమోదం..
దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్‌తో కలిసి.. 'స్పుత్నిక్-వి' టీకాపై క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది ఆర్డీఐఎఫ్. ఈ నేపథ్యంలో ఇటీవలే అత్యవసర వినియోగ అనుమతులకు డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన 24 గంటల్లోపే డీసీజీఐ 'స్పుత్నిక్-వి' టీకా అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది.
ఏడాదికి 85 కోట్ల డోసుల ఉత్పత్తి..