తెలంగాణ

telangana

ETV Bharat / business

మూడు నెలల్లో 4.9 కోట్ల స్మార్ట్​ఫోన్లు కొనేశారు..

భారత్​లో స్మార్ట్​ఫోన్​ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మూడు నెలల కాలంలోనే 4 కోట్ల 90 లక్షల స్మార్ట్​ఫోన్లు అమ్మకాలు నమోదుకావడమే ఇందుకు నిదర్శనం. స్మార్ట్​ఫోన్ మార్కెట్లో షియోమీ 26 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.

మూడు నెలల్లో 4.9 కోట్ల స్మార్ట్​ఫోన్లు కొనేశారు..

By

Published : Oct 25, 2019, 1:09 PM IST

భారత్​లో స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో స్మార్ట్​ఫోన్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

జులై-సెప్టెంబర్ మధ్య మూడు నెలల కాలంలో 49 మిలియన్ల స్మార్ట్​ఫోన్లు విక్రయమైనట్లు కౌంటర్​పాయింట్ రీసెర్చ్​ సంస్థ నివేదిక విడుదల చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఇది 10 శాతం ఎక్కువ.

"ఆన్​లైన్​లో కొనుగోళ్లపై అవగాహణ పెరగటం, ఆకర్షణీయమైన ప్రమోషన్​లు, క్యాష్​బ్యాక్, ఈఎంఐ, ఎక్స్​ఛేంజి ఆఫర్ల వంటివి విక్రయాలను పెంచాయి. ముఖ్యంగా పండుగ సీజన్ అమ్మకాలు, ఆఫ్​లైన్​లో విక్రయాల వృద్ధి ఇందుకు కారణమయ్యాయి."

- అన్షిక జైన్, కౌంటర్​పాయింట్​ పరిశోధన విశ్లేషకురాలు

ఏ సంస్థ వాటా ఎంత?

ఈ ఏడాది మూడో త్రైమాసికంలోనూ.. షియోమీ 26 శాతం మార్కెట్​ వాటాతో ప్రథమ స్థానంలో నిలిచింది. శామ్​సంగ్ 20 శాతం, వివో 17 శాతం, రియల్​ మీ 16 శాతం, ఒప్పో 8 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

లగ్జరీ స్మార్ట్​ఫోన్ యాపిల్ భారత్​లో ఉత్తమ 10 స్మార్ట్ ఫోన్​ బ్రాండ్లలో చోటు దక్కించుకుంది. ఐఫోన్​ ఎక్స్​ఆర్ మోడల్ ధర తగ్గించడం.. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్​ 11కు దక్కుతున్న ఆదరణతో యాపిల్ ఈ వృద్ధి సాధించగలిగింది.

ప్రీమియం స్మార్ట్​ఫోన్ విభాగంలో వన్​ప్లస్ ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది క్యూ3లో వన్​ప్లస్​ స్మార్ట్​ ఫోన్ల అమ్మకాలు దాదాపు రెట్టింపు అయినట్లు కౌంటర్​పాయింట్ పేర్కొంది. వన్​ప్లస్​ 7టీ విడుదల, వన్​ప్లస్ 7 సీరీస్​పై ఇస్తోన్న భారీ డిస్కౌంట్లు ఇందుకు కారణమని తెలిపింది.

ఫీచర్​ఫోన్లు డీలా..

స్మార్ట్​ఫోన్ల విక్రయాలు పెరిగినా.. ఫీచర్​ ఫోన్ల విక్రయాలు భారీగా తగ్గాయి. కౌంటర్​ పాయింట్​ ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే 37 శాతం క్షీణించినట్లు వెల్లడైంది. జియో ఫీచర్​ ఫోన్​ శ్రేణిలో కొత్త మోడల్ మార్కెట్లోకి రాకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఫీచర్​ఫోన్​ సెగ్మెంట్​లో శామ్​సంగ్ 22 శాతం మార్కెట్​ వాటాతో ప్రథమ స్థానంలో ఉంది. ఐటెల్ 16 శాతం, లావా 16 శాతం, నోకియా 12 శాతం మార్కెట్​ వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: దంతేరస్:​ పసిడి కొంటున్నారా.. ఈ ఐదూ సరిచూసుకోండి

ABOUT THE AUTHOR

...view details