గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)2019 ర్యాంకింగ్స్‌లో భారత్ 52వ స్థానాన్ని దక్కించుకుంది. జీఐఐ 2018లో సాధించిన 57వ స్థానంతో పోల్చుకుంటే ప్రస్తుతం 5 స్థానాలు వృద్ధి చెందింది భారత్. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ జీఐఐ ర్యాంకింగ్‌ను నేడు విడుదల చేశారు.
కార్నెల్ యూనివర్సిటీ, ఐఎన్ఎస్ఈఏడి, ఐరాస ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, జీఐఐ భాగస్వాములు సంయుక్తంగా ఈ ర్యాంకులను ప్రతి ఏటా ప్రకటిస్తాయి.
మొబైల్ అప్లికేషన్లు, విద్యారంగానికి కేటాయింపులు, సైన్స్, టెక్నాలజీ ప్లబ్లికేషన్ల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తారు.