తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాల వినియోగంలో రెండో స్థానం మనదే

అంతర్జాల వినియోగంలో 12 శాతం వినియోగదారులతో భారత్ రెండోస్థానంలో నిలించింది. చైనా 21 శాతం వాటాతో ప్రథమ స్థానంలో ఉంది. "మేరీ మీకర్స్​ 2019" నివేదిక ఈ విషయాలు వెల్లడించింది.

అంతర్జాల వినియోగం

By

Published : Jun 13, 2019, 12:28 PM IST

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాల వినియోగంలో భారత్​ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యప్తంగా మొత్తం అంతర్జాల వినియోగదారుల్లో 12 శాతం భారతీయులేనని మేరి మీకర్స్​ 2019 నివేదిక తెలిపింది.

అంతర్జాల వినియోగంలో రెండో స్థానంలో నిలిచేందుకు "రిలయన్స్ జియో" చొరవే ప్రధాన కారణమని పేర్కొంది నివేదిక. అమెరికా బయట వినూత్న అంతర్జాల సేవలందించే సంస్థ కూడా 'జియో'నే అని తెలిపింది.

"ప్రపంచ వ్యాప్తంగా 380 కోట్ల మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో 21 శాతంతో వాటాతో చైనా ప్రథమ స్థానంలో ఉంది. 12 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికా 8 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది." -మేరి మీకర్స్ నివేదిక

అంతర్జాల వృద్ధి తగ్గింది....

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాల వినియోగదార్లు 2017లో 7 శాతం పెరగ్గా... 2018లో 6 శాతమే వృద్ధి చెందారు.

జియోతోనే సాధ్యమైంది

భారత మార్కెట్లోకి సంచలనంగా ప్రవేశించిన రిలయన్స్​ జియో స్వల్ప కాలంలోనే 307 మిలియన్ల చందాదార్లను కలిగి ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఉచిత వాయిస్​ కాల్స్, డాటా చార్జీలు తక్కువగా ఉండటమేనని నివేదిక తెలిపింది.

జియో డిజిటల్ ద్వారా ఆన్​లైన్​ నుంచి ఆఫ్​లైన్​ ప్లాట్​ఫారం వరకు జియో సేవలను అందించనున్నట్లు రిలయన్స్ అధినేత ముకేశ్​ అంబానీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది నివేదిక. దీని ద్వారా రిలయన్స్ రిటైల్​కు వచ్చే 350 మిలియన్ల వార్షిక వినియోగదార్లు, 30 మిలియన్ల చిన్న వ్యాపారులను, 307 మిలియన్ల మందిని అనుసంధానించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా అంతర్జాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

నివేదిక తెలిపిన మరికొన్ని ప్రధాన అంశాలు

భారత్​లో అంతర్జాల వినియోగంపై నిఘా మెరుగ్గా ఉంది. అంతర్జాలంలో వచ్చే అనిశ్చిత కంటెంట్​పై భారత్ సెన్సార్​ చేస్తుంది.

భారత్​లో 2018లో జియో నెట్​ వర్క్​ ద్వారా 17-18 బిలియన్​ గిగాబైట్ల డాటా వినియోగం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details