తెలంగాణ

telangana

ETV Bharat / business

2025 నాటికి రిటైల్​ వ్యాపారాలు @ట్రిలియన్​ డాలర్లు!

రిటైల్ వ్యాపారాలకు అమెరికా, చైనాల తర్వాత భారత్​ అతిపెద్ద మార్కెట్​గా ఉన్నట్లు వాల్​మార్ట్​ అంచనా వేసింది. 2025 కల్లా భారత రిటైల్ వ్యాపారాలు (indian retail market value) ట్రిలియన్​ డాలర్ల మార్క్​ను దాటుతుందని పేర్కొంది.

expectations on retails business
రిటైల్ వ్యాపారాలపై అంచనాలు

By

Published : Aug 25, 2021, 2:57 PM IST

భారత రిటైల్ వ్యాపారాల(indian retail market value) విభాగం 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల మార్క్​ను దాటుతుందని వాల్​మార్ట్​ అధ్యక్షుడు, సీఈఓ డౌగ్​ మెక్​మిలాన్​ అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన మార్కెట్​లలో భారత్​ ఒకటని పేర్కొన్నారు. అమెరికా, చైనాల తర్వాత అతిపెద్ద మార్కెట్​గా కూడా భారత్​ ఉన్నట్లు వెల్లడించారు.

Converge@Walmart ఈవెంట్​లో ఈ విషయాలు తెలిపారు మెక్​మిలాన్​. 'భారత మార్కెట్ వైవిద్యమైంది. కొన్ని సందర్భాల్లో దేశమంతా వివిధ ప్రత్యేకతలు కనిపిస్తాయి. కాబట్టి స్థానిక అవసరాలకు తగ్గట్లు ఆలోచించి, స్థానికంగానే వాటిని అమలు చేయాలి. వీటితో పాటు కంపెనీకి కొన్ని సొంత నిబంధనలు ఉన్నాయి. వాటన్నింటిని.. పాటిస్తూనే ముందుకు సాగుతాం,' అని వివరించారు మెక్​మిలాన్​.

వాల్​మార్ట్​(walmart india) అనుబంధ సంస్థలైన ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​, డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్​పేలు సానుకూల వృద్ధితో ముందుకు సాగుతున్నాయని మెక్​మిలాన్​ పేర్కొన్నారు. ఫ్లిప్​కార్ట్​లో 3 లక్షలకుపైగా సెల్లర్స్​, ఫోన్​ పేకు 30 కోట్ల యూజర్లు ఉన్నట్లు తెలిపారు.

ఫోన్​పే ఇటీవలే 3.6 బిలియన్​ డాలర్ల నిధులు సమీకరించగా.. కంపెనీ విలువ 38 బిలియన్​ డాలర్లకు చేరింది.

ఇదీ చదవండి:LIC: ఎల్‌ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి!

ABOUT THE AUTHOR

...view details