తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2021, 5:12 AM IST

ETV Bharat / business

బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల విహారం త్వరలో

బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత డీజీసీఏ నిషేధం తొలగించింది. నియంత్రణ సంస్థల అనుమతులు లభించాక, మ్యాక్స్‌ విమానాల కార్యకలాపాలు సెప్టెంబరు చివరలో ప్రారంభించొచ్చని స్పైస్‌జెట్‌ తెలిపింది.

Boeing
బోయింగ్‌

బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల వాణిజ్య కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిపై విధించిన నిషేధాన్ని భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఎత్తివేయడమే ఇందుకు కారణం.

ఇండోనేషియాలోని లయన్‌ ఎయిర్‌కు 737 మ్యాక్స్‌ విమానం 2018 అక్టోబరు 29న, 2019 మార్చి 10న ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన 737 మ్యాక్స్‌ విమానం కుప్పకూలి వందల మంది మరణించారు. దీంతో ఇతర దేశాల తరహాలోనే 2019 మార్చి 13న బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను డీజీసీఏ కూడా నిలిపివేసింది.

అనంతరం 737 మ్యాక్స్‌ విమానాల్లో బోయింగ్‌ మార్పులు చేర్పులు చేపట్టింది. దీనితో పలు దేశాలు ఆ విమానాలకు మళ్లీ అనుమతులు ఇవ్వడం ప్రారంభించాయి. తాజాగా డీజీసీఏ కూడా అనుమతి ఇచ్చింది. 737 మ్యాక్స్‌ విమానాల సేవల ప్రారంభానికి అవసరమైన నిబంధనలను విమానయాన సంస్థలు పాటిస్తేనే అనుమతిస్తామని డీజీసీఏ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశీయంగా స్పైస్‌జెట్‌ మాత్రమే 737 మ్యాక్స్‌ 12 విమానాలను వినియోగిస్తోంది.

  • నియంత్రణ సంస్థల అనుమతులు లభించాక, మ్యాక్స్‌ విమానాల కార్యకలాపాలు సెప్టెంబరు చివరలో ప్రారంభించొచ్చని స్పైస్‌జెట్‌ తెలిపింది.

హైదరాబాద్‌ నుంచి జామ్‌నగర్‌కు స్టార్‌ ఎయిర్‌ విమానాలు:

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌, బెంగళూరులను నడిచే స్టార్‌ ఎయిర్‌ విమానాలను గురువారం కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. వారానికి మూడు సార్లు ఈ విమానాలు నడవనున్నాయి.

ఇదీ చదవండి:గూగుల్ చరిత్ర మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details