పన్ను ఎగవేత ఆరోపణలతో మీడియా దిగ్గజం జీ గ్రూప్ ముంబయి కార్యాలయంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని జీ గ్రూప్ కూడా ధ్రువీకరించింది.
ఐటీ అధికారులతో పూర్తిగా సహకరించినట్లు సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. వారికి కావాల్సిన అన్ని అధారాలను సమర్పించినట్లు వివరించారు. అయితే ముంబయి కార్యాలయంలో మాత్రమే సోదాలు నిర్వహించారా అనే విషయంపై స్పష్టతనివ్వలేదు.