తెలంగాణ

telangana

ETV Bharat / business

చట్టాల ఉల్లంఘనపై ఫ్లిప్​కార్ట్ క్లారిటీ!

ఎఫ్​డీఐ నిబంధనలు, భారతీయ చట్టాలకు లోబడే తమ కంపెనీ కార్యకలాపాలు జరుపుతున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ తెలిపింది. ఈడీ షోకాజ్​ నోటీసులపై స్పందనగా ఈ వివరాలు వెల్లడించింది.

show cause Notice to Flipkart
ఫ్లిప్​కార్ట్​కు షోకాజ్​ నోటీసులు

By

Published : Aug 5, 2021, 12:29 PM IST

Updated : Aug 5, 2021, 2:47 PM IST

వాల్​మార్ట్​కు చెందిన దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) నోటీసులపై స్పందించింది. తమ సంస్థ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్​డీఐ) నిబంధనలు, భారతీయ చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. నోటీసులపై ఈడీకి పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.

నోటీసులు ఎందుకు?

2009 నుంచి 2015 మధ్య పలు విదేశీ సంస్థలు ఫ్లిప్​కార్ట్​లో పెట్టిన పెట్టుబడుల విషయంలో.. విదేశీ మారకపు చట్టాలను ఉల్లఘించారని ఈడీ ఇటీవల పేర్కొంది. ఈ మేరకు ఫ్లిప్​కార్ట్ సహా.. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇతర కంపెనీలకు రూ.10,600 కోట్ల షోకాజ్​ నోటీసులు పంపింది ఈడీ.

ఇదీ చదవండి:యూజర్లకు వొడాఫోన్​​ ఐడియా హెచ్చరిక!

Last Updated : Aug 5, 2021, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details