ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల్లో.. 'ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)' టర్నోవర్ ర్యాంకు ప్రథమ స్థానానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇఫ్కో ర్యాంకు 125 నుంచి 65కు పెరగ్గా.. ఈ సారి ఏకంగా 300 ప్రధాన సహకార సంఘాల్లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
తాజాగా విడుదల చేసిన 9వ వార్షిక వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ (డబ్ల్యూసీఎం) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ రిపోర్ట్‌ను ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ) రూపొందించింది.