తెలంగాణ

telangana

ETV Bharat / business

సరికొత్త ఆవిష్కరణలతో అదరగొడుతున్న ఐఎఫ్​ఏ! - రోబో పిల్లి

జర్మనీలో జరుగుతున్న ఐఎఫ్​ఏ కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్​ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అధునాతన సాంకేతికతతో తయారైన స్మార్ట్​ఫోన్లు, సరికొత్త రోబోలు,  నడకను, మద్యం నాణ్యతను గుర్తించే పరికరాలు ఈ కార్యక్రమంలో హైలైట్​గా నిలిచాయి. ఈనెల 6న మొదలైన ఐఎఫ్ఏ 11న ముగియనుంది.

సరికొత్త ఆవిష్కరణలతో అదరగొడుతున్న ఐఎఫ్​ఏ!

By

Published : Sep 9, 2019, 7:32 AM IST

Updated : Sep 29, 2019, 10:59 PM IST

సరికొత్త ఆవిష్కరణలతో అదరగొడుతున్న ఐఎఫ్​ఏ!

జర్మనీ రాజధాని బెర్లిన్​లో జరుగుతున్న 'ఐఎఫ్​ఏ కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్​ ప్రదర్శన'లో సరికొత్త ఆవిష్కరణలు తళుక్కున మెరిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 1800 సంస్థలు వాటి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. వీటిని చూసేందుకు రోజుకు సుమారు 2.4 లక్షల మంది ప్రజలు వస్తున్నారు.

చైనా కిరిన్​-990 స్మార్ట్​ ఫోన్​...

చైనా​ కమ్యూనికేషన్​ దిగ్గజం హువావే.. అతి తక్కువ ధరకు లభించే కొత్త రకం స్మార్ట్​ ఫోన్​ను ప్రదర్శనలో ఉంచింది. 5జీ నెట్​వర్క్​కు​ సపోర్ట్​ చేసే కిరిన్​-990 హువావే మేట్​ 30 అనే మొబైల్​ ఫోన్.. ఇతర వాటితో పోల్చితే వేగం, బ్యాటరీ సామర్థ్యం​ ఎక్కువగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో హైసిలికాన్​ చిప్​సెట్​​ ఉంటుంది. 10 బిలియన్ల ట్రాన్సిస్టర్లు​ ఉంటాయి. మునిచ్​లో సెప్టెంబర్​ 19న ఈ ఫోన్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

లెనోవో సరికొత్త ఫోన్​...

చైనీస్​ ఎలక్ట్రానిక్​ సంస్థ లెనోవో సరికొత్త మోటోరోలా స్మార్ట్​ ఫోన్​ను ఆవిష్కరించింది. ప్రధానంగా సరికొత్త కెమెరా ఫీచర్స్​తో తీసుకొస్తున్న ఈ ఫోన్​లో క్వాడ్​ కెమెరా సిస్టమ్​ ఉంటుంది. 48 మెగా పిక్సెల్​ కెమెరాలో జూమ్​ చేసుకునే వీలుతో వైడ్​ యాంగిల్​ లెన్స్​ ఉన్నాయి. రెండు రోజుల పాటు వచ్చే 4000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ, 4జీబీ ర్యామ్​, 128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ ఉంటుంది. సెప్టెంబర్​ 5నే ఈ మొబైల్​ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది లెనోవో. వీటి ధర సుమారు 30 వేల పైనే ఉంది.

మద్యం నాణ్యతను గుర్తించే పరికరం...

ఫ్రాన్స్​కు చెందిన మైఓనో సంస్థ కొత్త వైన్​ స్కానర్​ను రూపొందించింది. ​ మీరు రుచి చూస్తున్న మద్యం నాణ్యత, పరిమాణం, రుచి వంటి వాటిని విశ్లేషించి వందకు ఎన్ని మార్కులు ఇవ్వచ్చో చెబుతుంది. మద్యంపై మీకు సూచనలూ చేస్తుంది. ఈ స్కానర్​ను మందు గ్లాస్​లో ఉంచుతే దానిపై విశ్లేషణలు జరిపి సమాచారాన్ని బ్లూటూత్​ ద్వారా మీ ఫోన్​కు చేరవేస్తుంది.

జంతు ప్రేమికులకు రోబో పిల్లి...

బెర్లిన్​ ఐఎఫ్​ఏ ఎలక్ట్రానికి ప్రదర్శనలో జపాన్​కు చెందిన యుకాయ్​ ఇంజినీరింగ్​ సంస్థ తీసుకొచ్చిన కొత్తరకం 'రోబో క్యాట్'​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంకుర పరిశ్రమల ఉత్పత్తులకు మాత్రమే అనుమతించే 'షోటాపర్స్​' ఈ రోబోను ప్రదర్శనకు ఉంచారు. ఈ పిల్లి రోబోను తట్టితే తోకను ఊపుతుంది. ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా ఊపుతూ నిజమైన జంతువును పట్టుకున్న అనుభూతిని కలిగిస్తుంది. జంతువులను పెంచుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సరికొత్త మొబైల్​ పౌచ్​లతో పాటు మనకు మూత్రం వచ్చే సమయాన్ని గుర్తించే డీ ఫ్రీ అనే పరికరాలు ప్రదర్శనలో ఉన్నాయి.

" మేము టోక్యోకు చెందినవాళ్లం. అక్కడి ప్రజలు చిన్నచిన్న అపార్ట్​మెంట్లలో నివసిస్తుంటారు. జంతువులను పెంచుకునే వీలుండదు. అందుకు ప్రత్యామ్నాయంగానే ఈ రోబో పిల్లిని ఆవిష్కరించాం."
-శున్​సుకే వోకి, యుకాయ్​ ఇంజినీరింగ్​ వ్యవస్థాపకుడు.

ఇదీ చూడండి:100రోజుల పాలనపై మోదీకి రాహుల్​ శుభాకాంక్షల పంచ్

Last Updated : Sep 29, 2019, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details