తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ-వాలెట్స్​తో జర భద్రం గురూ! - గూగుల్​ పే

ఈ-వాలెట్స్.. ఇప్పుడు బాగా వాడుకలో ఉన్న మొబైల్​ యాప్​లు. ఎప్పటికప్పుడు నూతన ఆఫర్లతో వినియోగదార్లను ఆకట్టుకుంటూ... డిజిటల్​ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటాయి ఈ-వాలెట్స్. మరి వాటిని వాడటం ఎంత మేర సురక్షితమో తెలుసా?

ఈ వాలెట్స్​తో జర భద్రం గురూ!

By

Published : Sep 15, 2019, 5:09 PM IST

Updated : Sep 30, 2019, 5:37 PM IST

మారుతున్న సాంకేతికతతో పాటు ఆర్థిక లావాదేవీల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల ఈ-వాలెట్స్​ వినియోగం గణనీయంగా పెరిగింది. కార్డుల ద్వారా చెల్లింపుల కన్నా... ఈ-వాలెట్స్​కే ఇప్పుడు ఆదరణ ఎక్కువ. క్యాష్​ బ్యాక్​ పేరుతో ఆయా సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్లు, వేగంగా లావాదేవీలు పూర్తి చేసే వీలు ఉండడమే ఇందుకు కారణం.

దేశంలో నోట్ల రద్దు తర్వాత ఈ-వాలెట్ల వాడకం ఊపందుకుంది. కిరాణా సరుకుల వంటి చిన్న చిన్న కొనుగోళ్ల నుంచి షాపింగ్​ మాల్​లో జరిపే భారీ కొనుగోళ్ల వరకు వీటి ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు చాలా మంది.

దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు ఈ-వాలెట్లకు కలిసొస్తున్నాయి. ఇలా లబ్ధిపొందిన సంస్థల్లో పేటీఎం పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ వరుసలో ఫోన్​ పే, మొబిక్విక్​, ఫ్రీ చార్జ్​, ఆక్సిజన్​, అమెజాన్​ పే, ఓలా మనీ... ఇలా ఎన్నో కంపెనీలు ఈ-వాలెట్​ సేవలందిస్తున్నాయి. ఏటా మరెన్నో సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

మరి ఈ-వాలెట్స్​ ఎంత మేర సురక్షితం? వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ-వాలెట్స్​తో లాభనష్టాలేంటి?

విశ్వసనీయత-భద్రత...

ఈ-వాలెట్​ సంస్థలు ప్రకటించే క్యాష్​ బ్యాక్​లనే కాకుండా... అవి ఎంత పారదర్శకంగా సేవలందిస్తున్నాయనే విషయం తెలుసుకోవడం మంచిది.
ఈ-వ్యాలెట్​లు ఎలాంటి సమాచారం తీసుకుంటున్నాయి? వాటి అవసరమెంత? అనే అంశాల ఆధారంగా వాలెట్​లకు అనుమతులివ్వాలి.
వ్యక్తిగత గోప్యత, ఖాతాకు సంబంధించిన ప్రమాణాలపై ప్రతి యాప్ ​ప్రైవసీ పాలసీ, షరతుల వివరాలు పూర్తిగా చదివి, ఆ తర్వాత వాటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలి.

చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే ఏదైనా సమస్య తలెత్తి.. సదరు సంస్థలను సంప్రదించినప్పుడు తమకు సంబంధం లేదని.. ఈ విషయాలను తమ నిబంధనల పట్టికలో ఉంచామని చెప్పే ప్రమాదము లేకపోలేదు. లావాదేవీల కోసం వాలెట్​కు అనుసంధానం చేసిన కార్డుల డాటా ఎంత వరకు సురక్షితం అనే విషయాన్నీ తెలుసుకోవాలి. ఓటీపీలు, సీవీవీ వంటి వివరాలు గోప్యంగా ఉంచాలి.

లాభనష్టాలు

ఎప్పుడూ నగదు వెంట పెట్టుకుని తిరగాల్సిన అవసం ఉండదు. క్యాష్​ బ్యాక్​లు, ఇతర ఆఫర్ల కారణంగా కొనాల్సిన వస్తువు కాస్త తక్కవకే లభించడం మంచి విషయమే. అయితే అన్ని సార్లు ఆఫర్ల పేరుతో ఆవసరం లేని వాటినీ కొనడం అనేది సరైంది కాదు.

కొన్ని సార్లు లావాదేవీల్లో పొరపాట్ల కారణంగా ఆ సొమ్మును తిరిగి పొందాలంటే సంస్థకు ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదులకు సంబంధించి ఈ-వాలెట్​ సంస్థలకు ఇటీవల కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ఆర్బీఐ.

వినియోగదారుడు రూ.10,000 లోపు నష్టపోయినట్లు గ్రహిస్తే... మూడు రోజుల్లో ఫిర్యాదు చేయాలి. అప్పుడు మాత్రమే ఆ సొమ్మును తిరిగి పొందగలరు. లేదంటే ఆ మొత్తానికి వినియోగదారుడే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: 'వాట్సాప్​ సందేశాలు ట్రేస్​ చేయాల్సిందే'

Last Updated : Sep 30, 2019, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details