తెలంగాణ

telangana

ETV Bharat / business

చందాకొచ్చర్​ దంపతులకు ఈడీ సమన్లు - ఈడీ

ఐసీఐసీఐ బ్యాంక్​-వీడియోకాన్​ కేసులో చందాకొచ్చర్​ దంపతులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 30న దీపక్​, రాజీవ్​, మే 3న చందాకొచ్చర్​ దిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

చందాకొచ్చర్​ దంపతులకు ఈడీ సమన్లు

By

Published : Apr 23, 2019, 1:48 PM IST

ఐసీఐసీఐ బ్యాంక్​-వీడియోకాన్​ రుణ మోసం వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్​ దంపతులకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ సమన్లు జారీ చేసింది. ఈనెల 30న దీపక్​ కొచ్చర్, ఆయన తమ్ముడు రాజీవ్​, మే 3న చందాకొచ్చర్ దిల్లీలో​ దర్యాప్తు అధికాల ముందు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్​ నివారణ చట్టం కింద వారి వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత, అధికారిక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను వెంట తీసుకురావాలని గతవారం జారీచేసిన సమన్లలో సూచించింది ఈడీ.

మనీలాండరింగ్​ కేసులో భాగంగా మార్చి 1న ముంబయిలోని పలువురి ఇళ్లల్లో తనిఖీలు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​. అనంతరం వారిని ఈడీ కార్యాలయంలో ప్రశ్నించింది.

ఐసీఐసీఐ బ్యాంక్​ నుంచి వీడియోకాన్​ సంస్థకు రూ.1875 కోట్ల రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్​ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండీ:రాహుల్​ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details