క్లిక్స్ గ్రూప్‌తో లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన ప్రతిపాదన ఒకవేళ కార్యరూపం దాల్చకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లను బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించమని కోరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ బ్యాంకులే విలీనానికి ఉత్తమమని వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్‌కు విలీనం-కొనుగోళ్లలో మంచి అనుభవముంది.
ఆ బ్యాంక్ విలీనానికి ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్‌లే ఉత్తమం - ఐసీఐసీఐ బ్యాంక్ వార్తలు
లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనానికి ఐసీఐసీఐ, కోటక్ బ్యాంకులే ఉత్తమమని ఆర్‌బీఐ భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్‌కు విలీనం-కొనుగోళ్లలో మంచి అనుభవముంది. కోటక్ బ్యాంక్ కూడా 2015లో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కొనుగోలు చేసింది.
ఆ బ్యాంక్ విలీనానికి ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్‌లే ఉత్తమం
గతంలో బ్యాంక్ ఆఫ్ మధుర (2000), సంగ్లి బ్యాంక్ (2007), బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ (2013)లను ఐసీఐసీఐ కొనుగోలు చేసింది. కోటక్ బ్యాంక్ కూడా 2015లో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ రెండు బ్యాంకులైతే కష్టాల్లో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను గట్టెక్కించగలవని బ్యాంకింగ్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Last Updated : Oct 5, 2020, 9:17 AM IST