తెలంగాణ

telangana

ETV Bharat / business

కొచ్చర్​ వివాదంపై హైకోర్టుకు ఐసీఐసీఐ బ్యాంక్​

చందా కొచ్చర్​​ అంశంపై బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది ఐసీఐసీఐ బ్యాంక్​. మేనేజింగ్​ డైరక్టర్​, సీఈఓ పదవి నుంచి ఆమెను వెంటనే తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. 2009 నుంచి 2018 మధ్య ఇచ్చిన బోనస్​లు, స్టాక్​లు వెనక్కి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరింది.

ICICI Bank seeks recovery of amounts from Chanda Kochhar
కొచ్చర్​కు షాక్​.. బోనస్​లు చెల్లించాలని కోర్టుకు బ్యాంక్​

By

Published : Jan 13, 2020, 8:30 PM IST

చందా కొచ్చర్​ను మేనేజింగ్​ డైరక్టర్​, కార్యనిర్వాహక అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది ఐసీఐసీఐ బ్యాంక్​. ఆమెకు అందించిన వివిధ రకాల సొమ్ములనూ వసూలు చేయడానికి ఆదేశాలివ్వాలని కోరింది.

తనను పదవి నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ చందా కొచ్చర్​ దాఖలు చేసిన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా ఐసీఐసీఐ ఈ అఫిడవిట్​ దాఖలు చేసింది. కొచ్చర్​ వ్యాజ్యాన్ని కొట్టివేయాలనే అంశాన్ని వాణిజ్య దావా(కమర్షియల్​ సూట్​)తో నిర్ణయించవచ్చని పేర్కొంది.

"2016 ఏప్రిల్​-2018 మార్చి కాలంలో అందించిన బోనస్​లు, స్టాక్​​లను క్లాబ్యాక్​ రూపంలో వెనక్కి ఇచ్చేలా కొచ్చర్​కు ఆదేశాలివ్వాలని పిటిషన్​ వేశాం."
- ఐసీఐసీఐ బ్యాంకు

క్లాబ్యాక్​ అంటే..

దుష్ప్రవర్తన, లాభాల తగ్గుదలతో ఓ ఉద్యోగికి ఇచ్చిన బోనస్​, ఇతర చెల్లింపులను వెనక్కి తీసుకునే వెసులుబాటే క్లాబ్యాక్​.

ఈనెల 20న విచారణ..

జస్టిస్​ ఆర్​ వీ మోరే, జస్టిస్​ ఎస్​పీ తవాడే బెంచ్​.. ఐసీఐసీఐ దాఖలు చేసిన అఫిడవిట్​ను పరిశీలించాలని చందా కొచ్చర్​ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. దీనిపై ఈ నెల 20న విచారించనుంది బొంబాయి హైకోర్టు.

వివాదం ఇలా..

వీడియోకాన్‌ గ్రూప్‌నకు.. ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణం ఇవ్వడంపై గతేడాది దుమారం చెలరేగింది. ఈ అంశంపై ఆరోపణలు ఎదుర్కొన్న కొచ్చర్​ను.. బ్యాంక్‌ బోర్డు తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పించింది. కానీ, ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడం మొదలు పెట్టింది. జూన్‌ 6న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ బీఎన్‌ శ్రీకృష్ణను ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి నియమించింది.

ఈ పరిణామాల తర్వాత ఆమెను తొలగిస్తున్నట్లు బ్యాంక్‌ అధికారికంగా ప్రకటించింది. ఆమెకు చెల్లించాల్సిన బోనస్‌లు, ఇతర మొత్తాలను నిలిపివేసింది. ఏప్రిల్‌ 2009 నుంచి 2018 మార్చి వరకు చెల్లించిన బోనస్‌లనూ వాపస్‌ చేయాలని కోరింది.

ABOUT THE AUTHOR

...view details