దిగ్గజ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ లాభం గణనీయంగా పెరిగింది. జనవరి-మార్చి(2020-21 క్యూ4) త్రైమాసికంలో ఏకంగా మూడు రెట్లు అధికంగా నికర లాభాన్ని గడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.1,221 కోట్ల లాభం రాగా.. ఈ సారి రూ.4,403 కోట్లు ఆర్జించింది.
స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన బ్యాంకు మొత్తం రాబడి రూ.23,953 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం రూ.4,886 కోట్లు అని ఐసీఐసీఐ వెల్లడించింది. కన్సాలిడేటెడ్ విధానం ప్రకారం బ్యాంకు ఆదాయం రూ.43,621 కోట్లుగా నమోదైందని తెలిపింది.