ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ 'ఫిన్ టెక్' విభాగంలోకి అడుగు పెట్టింది. 'ఐ మొబైల్ పే' పేరుతో కొత్త పేమెంట్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే కాకుండా.. ఇతర బ్యాంక్ కస్టమర్లకూ పేమెంట్స్, బ్యాంకింగ్ సేవలందించనుంది.
గూగుల్‌పే, పేటీఎంకు పోటీగా ఐసీఐసీఐ యాప్ - పేటీఎంకి పోటీగా ఐసీఐసీఐ బ్యాంక్ యాప్
గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పేమెంట్ యాప్‌ను ఆవిష్కరించింది. ఐ మొబైల్ పే పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్.. ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల కస్టమర్లకూ యూపీఐ, బిల్ పేమెంట్ సేవలు అందించనుంది.
ఐ మొబైల్ పే యాప్ ఫీచర్లు
ఈ యాప్ ద్వారా వినియోగదారులు యూపీఐ ఆధారిత పేమెంట్లు, బిల్ పేమెంట్స్ (రీఛార్జ్, కరెంట్ బిల్ లాంటివి) చేయొచ్చు. పెట్టుబడులు, క్రెడిట్ కార్డ్, గిఫ్ట్ కార్డ్, ట్రావెల్ కార్డ్ వంటి సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.
ఇదీ చూడండి:జనవరి 31లోపు అందరికీ రీఫండ్: ఇండిగో