కొవిడ్ సంక్షోభం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు.. వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐబీఎం చేరింది. ఉద్యోగాల కోతకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది.
ఎన్ని ఉద్యోగాలు తొలగిస్తుందో ఐబీఎం స్పష్టతనివ్వకపోయినా.. ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
"ఈ నిర్ణయం వల్ల ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను గుర్తించి... ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ 2021 జూన్ వరకు సబ్సిడీ మెడికల్ కవరేజీని ఐబీఎం అందిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే వ్యాపార దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. అధిక పోటీతత్వం ఉన్న మార్కెట్లో అత్యుత్తమ నైపుణ్యాల కలబోత అవసరం."
-ఐబీఎం