సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్.. దేశీయ సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్లో భారీ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు జరుగుతున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది.
బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న షేర్ చాట్ సంస్థ.. 150 నుంచి 200 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం గూగుల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలతో చర్చలు జరుపుతోంది.
మైక్రోసాఫ్ట్తోనూ చర్చలు..
ఇటీవవలే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తోనూ షేర్ చాట్ చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. షేర్ చాట్లో మైక్రోసాప్ట్ 100 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశముందనేది ఈ వార్తల సారాంశం. ఇది షేర్ చాట్ సమీకరించాలనుకున్న నిధుల్లో మూడో వంతుకు సమానం కావడం గమనార్హం. అయితే ఈ విషయంపై మైక్రోసాఫ్ట్, షేర్ చాట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.