ప్రముఖ ఆరోగ్య ఉత్పత్తుల తయారీ సంస్థ జాన్సన్ & జాన్సన్.. కరోనా నియంత్రణకై వ్యాక్సిన్ ప్రయోగానికి సిద్ధమైనట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి మానవునిపై పరీక్షలు నిర్వహిస్తామని, వచ్చే ఏడాది ప్రారంభంలో అత్యవసర వినియోగానికి సిద్ధంగా ఉంటుందని తెలిపింది.
ఈ ప్రయత్నంలో భాగంగా 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు.. అమెరికా ప్రభుత్వ బయోమెడికల్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీతో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. జనవరిలోనే కరోనాకు టీకా కనుగొనేందుకు జాన్సన్ సంస్థ పనులు ప్రారంభించింది. ఎబోలా వైరస్ కోసం వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే ఇందుకు ఉపయోగిస్తోంది.