ప్రపంచవ్యాప్తంగా చర్మ సౌందర్య సాధనాల్లో మొదటగా వినిపించే పేరు... ఫెయిర్ అండ్ లవ్లీ. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా దీనిని చాలా మంది వినియోగిస్తుంటారు.
అయితే ఫెయిర్ అండ్ లవ్లీపై.. దాని తయారీ సంస్థ హిందుస్థాన్ యూనీలీవర్(హెచ్‌యూఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. 'ఫెయిర్ అండ్ లవ్లీ' అన్న పేరు నుంచి 'ఫెయిర్' పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
అందం అంటే 'ఫెయిర్' మాత్రమే కాదు అని తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఉత్పత్తి రీ బ్రాండింగ్‌కు నియంత్రణపరమైన అనుమతులు లభించాల్సి ఉందని పేర్కొంది.