తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగస్టు 1న హువావే "వై9 ప్రైమ్ 2019" - పాప్-అప్​ కెమెరా

పాప్​-అప్​ సెల్ఫీ కెమెరాతో కొత్త స్మార్ట్​ ఫోన్​ను తీసుకురానుంది ఎలక్ట్రానిక్ దిగ్గజం హువావే. "వై9 ప్రైమ్ 2019" పేరుతో ఆగస్టు 1న భారత మార్కెట్లో ఈ ఫోన్​ను విడుదల చేయనుంది.

హువావే

By

Published : Jul 25, 2019, 1:09 PM IST

చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం హువావే భారత్​లో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. "వై9 ప్రైమ్ 2019" పేరుతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్​ను ఆగస్టు 1న మార్కెట్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. పాప్​-అప్​ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.

"వై9 ప్రైమ్ 2019" ఫీచర్లు:

  • 16.7 సెంటీమీటర్ల పూర్తి డిస్​ప్లే
  • 4 జీబీ ర్యామ్/128 జీబీ రోమ్
  • 16 ఎంపీ పాప్​-అప్​ సెల్ఫీ కెమెరా (ఏఐ సపోర్ట్)
  • 4000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ఆక్టా-కోర్​ కిరిన్ 710 ప్రాసెసర్​
  • కృత్రిమ మేధతో పనిచేసే వెనుక కెమెరా. ఒకే సారి 22 విభాగాలు, 500 దృశ్యాలను చిత్రీకరించే సామర్థ్యం

రియర్ కెమెరా మెగా పిక్సెల్​, ఫోన్ ధర వంటి వివరాలు వెల్లడించలేదు హువావే.

ఇదీ చూడండి: 500 కోట్ల​ డాలర్ల జరిమానా చెల్లింపునకు ఫేస్​బుక్​ రెడీ

ABOUT THE AUTHOR

...view details