తెలంగాణ

telangana

ETV Bharat / business

యాపిల్​ను వెనక్కి నెట్టి 2వ స్థానానికి హువావే - స్మార్ట్ ఫోన్ అమ్మకాలు

స్మార్ట్​ఫోన్ల అమ్మకాల్లో చైనా ఎలక్ట్రానిక్​ దిగ్గజం హువావే సత్తాచాటింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 50.3 శాతం అమ్మకాల వృద్ధితో కాలిఫోర్నియా కంపెనీ యాపిల్​ను వెనక్కి నెట్టింది. సామ్​సంగ్​ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

హువావే

By

Published : May 1, 2019, 11:34 AM IST

స్మార్ట్​ఫోన్ల​ అమ్మకాల్లో యాపిల్​ను వెనక్కినెట్టింది చైనా ఎలక్ట్రానిక్​ దిగ్గజం హువావే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జరిగిన భారీ అమ్మకాలతో స్మార్​ చరవాణుల మార్కెట్లో రెండో స్థానంలో నిలిచింది.

గతేడాదితో పోలిస్తే 2019 మొదటి 3 నెలల్లో స్మార్ట్​ఫోన్ అమ్మకాలు 6.6 శాతం క్షీణించి 310.8 మిలియన్ల విక్రయాలు నమోదయ్యాయి.​ స్మార్ట్​ఫోన్ల​ అమ్మకాలు క్షీణించడం ఇది వరుసగా ఆరో త్రైమాసికం.

ఇందుకు భిన్నంగా విక్రయాల్లో హువావే రాణించింది. మొత్తం 50.3 శాతం వృద్ధిని సాధించింది. 59.1 మిలియన్​ యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది.

71.9 మిలియన్​ యూనిట్ల అమ్మకాలతో సామ్​సంగ్​ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే సామ్​సంగ్ అమ్మకాలు 8.1 శాతం క్షీణించాయి.

అమెరికాకు చెందిన స్మార్ట్​ఫోన్​ దిగ్గజం యాపిల్ ఐఫోన్ విక్రయాలు 30.2 శాతం తగ్గి మార్కెట్లో మూడో స్థానానికి పడిపోయింది.

చైనా కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది.

ఈ ఏడాదీ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కోవచ్చని.. హువావే మాత్రం మంచి వృద్ధిని సాధిస్తుందని ఐడీసీ అంచనా వేసింది.

అయితే స్మార్ట్​ఫోన్ల అమ్మకాల్లో తగ్గుదలకు ప్రధాన కారణం నూతన మోడళ్లు, రాబోయే తరం 5జీ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులపై వినియోగదారుల అంచనాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: భారీగా తగ్గిన శామ్​సంగ్​ ఆదాయం

ABOUT THE AUTHOR

...view details