తెలంగాణ

telangana

ETV Bharat / business

హెచ్ఎస్​బీసీలో 10,000 ఉద్యోగాల కోత! కారణమిదే.. - వడ్డీ రేట్లు పడిపోవడం, బ్రెగ్జిట్‌, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతల వల్ల గత కొంత కాలంగా సంస్థ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది

కొంత కాలంగా ఒడుదొడుకుల్లో ఉన్న హెచ్​ఎస్​బీసీ భారీగా ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అత్యధిక వేతనాలున్న 10,000 మంది ఉద్యోగులను తొలగించుకుని వ్యయాలను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

హెచ్​ఎస్​బీసీలో భారీగా ఉద్యోగాల కోత

By

Published : Oct 8, 2019, 8:48 AM IST

అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం హాంకాంగ్​ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్​ (హెచ్‌ఎస్‌బీసీ) భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4,000 ఉద్యోగాలు తొలగించిన హెచ్​ఎస్​బీసీ.. మరో 10,000 మందిపై వేటు వేసే యోచనలో ఉన్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. వీరిలో అధిక వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

ఉద్యోగాల కోత ఎందుకంటే..

వడ్డీ రేట్లు పడిపోవడం, బ్రెగ్జిట్‌, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతల వల్ల గత కొంత కాలంగా సంస్థ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. బలహీన అంతర్జాతీయ వృద్ధి వీటికి తోడైంది. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత విధించాలని హెచ్​ఎస్​బీసీ భావిస్తోంది.

ఇదీ చూడండి: దసరా వేళ ఇన్ని లక్షల స్మార్ట్​ఫోన్లు కొనేశారా...?

ABOUT THE AUTHOR

...view details