వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో 'హాట్ స్టార్' ప్రథమ స్థానంలో ఉన్నట్లు 'టెక్ ఏఆర్సీ-అనోమెర్ మెగాఇన్సైట్' తాజా సర్వేలో వెల్లడించింది. ఓవర్ ది టాప్ (ఓటీటీ)ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఈ యాప్‌నకు 49 శాతం వినియోగ వాటా ఉన్నట్లు తెలిపింది. లైవ్ ఛానెల్ విభాగంలో 30 శాతం వాటాతో 'జియో టీవీ' అగ్ర స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది.
ఈ సర్వే ప్రకారం భారత్‌లో 79 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వినోదం కోసం ఓటీటీ యాప్‌లను వినియోగిస్తున్నారు. సాధారణ ఎంటర్టైన్మెంట్ యాప్‌లైన యూట్యూబ్, టిక్ టాక్లకు అదనంగా వీటిని వాడుతున్నారు.
"గత మూడేళ్లలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. డాటా చార్జీలు భారీగా తగ్గాయి. ఈ కారణంగా ఓటీటీ ఎంటర్టైన్మెంట్ సేవల్లో వృద్ధి, వినియోగం పెరిగింది."
-ఫైసల్ కవూస, టెక్ ఏఆర్సీ వ్యవస్థాపకుడు