తెలంగాణ

telangana

ETV Bharat / business

Honda Price Hike: హోండా షైన్‌ ధర పెంపు - రెండు నెలల్లో రెండు సార్లు పెరిగిన షైన్​ ధర

ప్రముఖ బైక్​ల కంపెనీ హోండా.. షైన్ మోడల్ ధరను మరోసారి పెంచింది. గడిచిన రెండు నెలల్లో హోండా బైక్​ల ధరలు పెంచడం ఇది రెండో సారి. ధర పెంచినప్పటికీ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లకు రూ.3,500 వరకు డిస్కౌంట్ లభించనుంది.

Honda bikes price hiked
హోండా బైక్ ధర పెంపు

By

Published : Jun 4, 2021, 4:51 PM IST

హోండా మోటార్ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా షైన్‌ బైక్‌ ధరను పెంచింది. ప్రస్తుతం హోండా తయారు చేసే బైకుల్లో ఇదే అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్‌. దీని ధర రూ.1,072 పెంచుతున్నట్లు ప్రకటించింది కంపెనీ.

ధరల పెంపుతో డ్రమ్‌ బ్రేక్‌ వేరియంట్‌ షైన్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.71,550గా ఉండగా.. డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్‌ ధర రూ.76,346గా ఉంది.

ఇప్పటికే ఈ బైకును ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగించి, ఈఎంఐలపై కొనుగోలు చేసే వారికి రూ.3,500 వరకు డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

సర్వీస్​ గడువు పెంపు..

హోండా తన వినియోగదారులకు ఉచిత సర్వీసుల గడువు పెంపును కూడా ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి మే 31 మధ్యలో ఉచిత సర్వీసుల గడువు ముగిసే వారికి జులై 31 వరకు అవకాశం ఇచ్చింది. లాక్‌డౌన్లు ముగిసిన ప్రాంతాల్లో వారు సర్వీసులు పొందవచ్చని తెలిపింది. షైన్‌లో 125 సీసీ ఇంజిన్‌ అమర్చారు. ఇది 10.72 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనికి 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ అమర్చారు.

ఇదీ చదవండి:దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details