తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫస్ట్​ డే ఫస్ట్​ షోతో 'ఇంటి థియేటర్లు' హిట్​! - new movie

వచ్చే ఏడాది నుంచి విడుదలైన కొత్త సినిమాలను ఇంట్లోనే చూసేందుకు అవకాశం కల్పించనున్నట్లు రిలయన్స్​ జియో ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంపన్న వర్గాలకే పరిమితమైన 'ఇంటి థియేటర్' విధానం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంటున్నారు.

ఫస్ట్​ డే ఫస్ట్​ షోతో 'ఇంటి థియేటర్లు' హిట్​!

By

Published : Aug 18, 2019, 5:47 AM IST

Updated : Sep 27, 2019, 8:45 AM IST

ఫస్ట్​ డే ఫస్ట్​ షోతో 'ఇంటి థియేటర్లు' హిట్​!

థియేటర్లో విడుదలయ్యే కొత్త సినిమాని ఇంట్లోనే కూర్చుని చూడవచ్చని ఇటీవలే సంచలన ప్రకటన చేసింది రిలయన్స్ జియో​. కానీ అప్పుడే విడుదలైన సినిమాలను సాధారణ టీవీల్లో చూస్తే.. థియేటర్ అనుభూతి రాదు అనేది చాలా మంది వాదన. ఈ వాదనలకు అడ్డుకట్ట వేసేందుకు పలు సంస్థలు ఇంట్లోనే థియేటర్​ను రూపొందించే ఆలోచనతో ముందుకొచ్చాయి.

అనేక మంది ఇప్పటికే ఈ సదుపాయాలను వినియోగించుకుంటున్నారు. నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్​స్టార్ వంటి.. సంస్థల కంటెంట్​ను చూసేందుకు ఈ థియేటర్లు ఎక్కువగా వాడుతున్నారు. తమ వినియోగదారుల కోసం ఆయా సంస్థలు ప్రత్యేకంగా కొత్త సినిమాలను వారి ఇంట్లోని థియేటర్లలో చూసే వీలును కల్పిస్తున్నాయి. అయితే ఈ సదుపాయాలు కాస్త ఖర్చుతో కూడుకున్నవి. ఈ కారణంగా ఇవి సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమయ్యాయని చెప్పాలి.

థియేటర్​ నిర్మాణ ఖర్చు...

ఇంట్లో థియేటర్​ నిర్మించుకునేందుకు సాధారణంగా రూ.లక్షన్నర కన్నా ఎక్కువ వెచ్చించే అవకాశముందని హోం థియేటర్ల నిర్మాణ సంస్థ 'వెక్టర్ సిస్టమ్స్' ఎండీ శేషా రెడ్డి తెలిపారు.

సామాన్యుడికీ అందుబాటులో..!

జియో ప్రీమియం చందాదారులకు 'ఫస్ట్​ డే ఫస్ట్ షో' సదుపాయం 2020 ద్వితీయార్ధం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద నగరాలకే పరిమితమైన ఇంటి థియేటర్ల ట్రెండ్ చిన్న పట్టణాలకూ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జియో ప్రీమియం కంటెంట్​ సామాన్యులకు అందుబాటులో ఉండొచ్చని అంచనా. వారిని ఆకర్షించేందుకు.. పలు సంస్థలు బడ్జెట్​కు అనుకూలంగా థియేటర్ నిర్మాణానికి ముందుకొస్తాయని అంటున్నారు.

ఇదీ చూడండి:'కుచ్​ కుచ్​ హోతా హై' సీక్వెల్​లో వీరేనా..!

Last Updated : Sep 27, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details