తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఉద్యోగం పోతుందని ప్రతి 10 మందిలో ముగ్గురికి భయం'

దేశవ్యాప్తంగా వరుసగా రెండో నెల ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గాయి. జాబ్​ పోర్టల్​ నౌకరీ డాట్​ కామ్​ విడుదల చేసిన నివేదిక ప్రకారం మేలో ఉద్యోగ నియామకాలు 61 శాతం తగ్గిపోయాయి. దేశవ్యాప్త లాక్​డౌనే ఇందుకు కారణమని తెలిపింది నౌకరీ డాట్​ కామ్. ఇప్పుడున్న ఉద్యోగం పోతుందని ప్రతి 10 మందిలో ముగ్గురు భయపడుతూ, కొత్త కొలువు కోసం వెతుకుతున్నారని వెల్లడించింది.

lockdown Impact on jobs
ఉద్యోగ నియామకాలపై లాక్​డౌన్ ప్రభావం

By

Published : Jun 9, 2020, 5:39 PM IST

దేశవ్యాప్త లాక్​డౌన్ కారణంగా మేలో ఉద్యోగ నియామకాలు 61 శాతం తగ్గాయి. ఉద్యోగ నియామకాలు 60 శాతానికిపైగా పడిపోడవం ఇది వరుసగా రెండో నెల. ఏప్రిల్​లోనూ నియామకాలు 62 శాతం తగ్గాయి. ప్రముఖ జాబ్​ పోర్టల్ నౌకరీ డాట్​కా​మ్​ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది.

నౌకరీ డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌లో నమోదైన ఉద్యోగాల సంఖ్య ఆధారంగా నియామకాలను లెక్కించి నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ గణాంకాలను ప్రతినెలా విడుదల చేస్తుంది. ఈ సూచీ ప్రకారం.. 2019 మేలో 2,346 నియామకాలు జరగ్గా, 2020 మేలో 910కి పరిమితమయ్యాయి.

'నౌకరీ' నివేదికలోని కీలకాంశాలు..

  • ఆతిథ్యం, రెస్టారెంట్లు, పర్యటకం, విమానయాన రంగాల్లో నియామకాలు అత్యధికంగా 91 శాతం క్షీణించాయి.
  • రిటైల్​ (-87 శాతం), వాహన, విడిభాగాలు (-76 శాతం), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో (-70 శాతం ) క్షీణత నమోదైంది.
  • దాదాపు ప్రధాన పట్టణాలన్నింటిలో నియమాకాలు 50 శాతానికిపైగా తగ్గాయి.
  • మెట్రో నగరాల్లో కోల్​కతాలో అత్యధికంగా 68 శాతం, దిల్లీ, ముంబయిలో 67 శాతం క్షీణత నమోదైంది.
  • గత నెలలో ఉద్యోగం కోసం వెతికిన ప్రతి 10 మందిలో ఒకరు ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు. 10 మందిలో కనీసం ముగ్గురు ఇప్పుడున్న ఉద్యోగం పోతుందనే భయంతో కొత్త ఉద్యోగం కోసం వెతికారు.
  • ఇటీవల ఉద్యోగం కోల్పోయి ఉద్యోగం కోసం వెతికేవారిలో 10 శాతం మందిలో.. విమానయానం, ఈ-కామర్స్ రంగాలకు చెందినవారు 15 శాతం చొప్పున ఉన్నారు. ఆతిథ్య రంగానికి చెందిన వారు 14 శాతం మంది ఉన్నారు.
  • ఇటీవల ఉద్యోగం కోల్పోయిన వారిలో 13 శాతం మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు ( 11 ఏళ్లకు పైగా అనుభవం) ఉన్నారు.

ఇదీ చూడండి:దుమ్ములేపిన 'పార్లే-జీ'... 80 ఏళ్ల రికార్డు బ్రేక్​

ABOUT THE AUTHOR

...view details