తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు- తెలుసుకోవాల్సిన 9 అంశాలు - ఎంపీసీ కమిటీ

ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది ఆర్బీఐ. మూడు రోజుల సమావేశంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల పూర్తి వివరాలు మీకోసం.

ఆర్బీఐ

By

Published : Oct 4, 2019, 1:46 PM IST

భారీ అంచనాల నడుమ అక్టోబర్​ 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి విధాన సమీక్ష నేడు ముగిసింది. అనుకున్నట్లుగానే మరోసారి వడ్డీ రేటు తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు క్లుప్తంగా..

  • రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 2019లో వరుసగా ఐదోసారి వడ్డీ కోత
  • తాజా కోతతో 5.15 శాతానికి చేరిన రెపో రేటు. 4.90 శాతంగా రివర్స్​ రెపో రేటు
  • 25 బేసిస్ పాయింట్ల వడ్డీ కోతకు ద్రవ్య పరపతి విధాన కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఆమోదం
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనా 6.1 శాతానికి తగ్గింపు. అంతకుముందు 6.9 శాతంగా ఉన్న వృద్ధి అంచనా
  • ఆర్థిక వృద్ధి ఊతమిచ్చే విధానం కొనసాగించిన ఆర్బీఐ
  • ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో డిమాండ్​ పెరుగుదల, పెట్టుబడుల వృద్ధికి అవకాశం
  • ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో చిల్లర ద్రవ్యోల్బణం 3.5-3.7 శాతం ఉంటుందని అంచనా
  • అక్టోబర్ 1 నాటికి 434.6 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారకం నిల్వలు
  • తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష డిసెంబర్​ 3-5 తేదీల్లో...

ABOUT THE AUTHOR

...view details