వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ బడ్జెట్‌పై లగ్జరీ కార్ల తయారీ సంస్థలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి.
అధికంగా ఉన్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రేట్లు, దిగుమతి సుంకాలు, రిజిస్ట్రేషన్ రుసుముల కారణంగా లగ్జరీ కార్ల వ్యాపారం వృద్ధికి నోచుకోవడం లేదని పలు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న బడ్జెట్లో కేంద్రం తమకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నాయి.
ఆడీ ఏమంటుందంటే..
దేశవ్యాప్తంగా గత ఏడాది తమ కార్ల అమ్మకాలు 28.92 శాతం తగ్గి 4,594 యూనిట్లకు పరిమితమైనట్లు 'ఆడీ' తెలిపింది. అంతకు ముందు 2018లో 6,463 యూనిట్లు విక్రయించిన విషయాన్ని గుర్తు చేసింది జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.
తాము మాత్రమే కాకుండా లగ్జరీ కార్ల సంస్థలన్నీ గత ఏడాది భారీగా అమ్మకాల క్షీణతను చవి చూసినట్లు 'ఆడీ' తెలిపింది. లగ్జరీ కార్ల వ్యాపారం తిరిగి పుంజుకోవాలంటే ప్రభుత్వ సహాయం అవసరమని అంటోంది.
ప్రోత్సాహకాలు ఇలా ఉంటే మేలు..