తెలంగాణ

telangana

ETV Bharat / business

రయ్​రయ్​: అమ్మకాల్లో మరోసారి టాప్ 'హీరో' - అగ్ర స్థానంలో హీరో

ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 78 లక్షలకుపైగా విక్రయాలతో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది హీరో మోటార్స్​. అంతకన్నా 20 లక్షల యూనిట్లు తక్కువగా విక్రయించి రెండో స్థానంతో సరిపెట్టుకుంది హోండా.

మరోసారి టాప్ 'హీరో'

By

Published : Apr 7, 2019, 2:32 PM IST

ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది హీరో మోటార్స్​. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. హీరో మోటార్స్​ 78,20,745 యూనిట్లు విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. ఇదే కాలానికి హోండా 59,00,840 యూనిట్లు అమ్మి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

ఒకప్పుడు హీరో, హోండా వ్యాపార భాగస్వాములు. ఇప్పుడు పోటీ సంస్థలు. రెండింటి మధ్య రేసులో హీరో ముందుంది. హోండా కన్నా హీరో 19,19,905 యూనిట్లు అధికంగా విక్రయించింది.

గత ఆర్థిక సంవత్సరం (2017-18లో) హీరో మోటార్స్​ 75,87,130 లక్షల యూనిట్లు విక్రయించగా... హోండా 61,23,877 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది.

ఎక్స్​ట్రీమ్​, డెస్టినీతో దూకుడు...

ప్రీమియం మోటార్​ సైకిళ్ల విభాగంలో 'ఎక్స్​ట్రీమ్​ 200 ఆర్​'ను ప్రవేశపెట్టింది హీరో మోటార్స్​. దీంతో పాటు 'డెస్టినీ 125' స్కూటర్లు భారీగా అమ్ముడవడం హీరోను అగ్రస్థానంలో నిలిపింది.

గడిచిన ఆర్థిక సంవత్సరం దేశీయ విపణిలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని హోండా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి హీరోను దాటి ప్రథమ స్థానంలో నిలవడమే తమ ముందున్న లక్ష్యమని హోండా ఓ ప్రకటనలో వెల్లడించింది.

బజాజ్, టీవీఎస్​ లెక్కలు...

పుణె కేంద్రంగా పని చేస్తున్న బజాజ్ ఆటో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 42,36,873 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయానికి టీవీఎస్ మోటార్ కంపెనీ 37.57 లక్షల యూనిట్లు విక్రయించి నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details