తెలంగాణ

telangana

ETV Bharat / business

దూకుడు పెంచిన హీరో.. రెండు నెలల్లో 10 కొత్త మోడళ్లు! - హీరో నుంచి 10 కొత్త మోడళ్లు

బీఎస్​-6 ఉద్గార నియమాలకు అనుగుణంగా పాత మోడళ్లను ఆధునీకరించడంలో హీరోమోటార్స్ దూకుడు పెంచింది. మరో 4 నుంచి 8 వారాల్లో మొత్తం 10 మోడళ్లకు కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. బీఎస్​-6 ఉద్గార నియమాలతో తొలి మోడల్​ విక్రయాలను ఇదివరకే ప్రారంభించింది హీరో మోటార్స్.

HERO MOTO
హీరో మోటార్స్

By

Published : Dec 12, 2019, 8:35 PM IST

దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరోమోటోకార్ప్​ 10 మోడళ్లను బీఎస్-6 నిబంధనల ప్రకారం త్వరలోనే ఆధునీకరించనున్నట్లు ప్రకటించింది. వీటిలో ఐదు మోడళ్లు ఎక్కువగా అమ్ముడయ్యే విభాగంలోనివేనని పేర్కొంది.

2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్​-6 ఉద్గార నియమాలు తప్పని సరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ గడువులోపే.. తమ మోడళ్లను బీఎస్​-6 నిబంధనలకు అనుగుణంగా ఆధునీకరించనున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు తెలిపాయి.

కొత్త ఉత్పత్తులతో.. 2020 ఫిబ్రవరిలో జైపుర్​లోని సంస్థ పరిశోధన కేంద్రం(సెంటర్​ ఫర్​ ఇన్నోవేషన్​ అండ్​ టెక్నాలజీ)లో భారీ ఎత్తున ఓ ప్రదర్శన నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

రానున్న 4-8 వారాల్లో కంపెనీ.. స్ల్పెండర్, హెచ్​ఎఫ్​ డీలక్స్​, గ్లామర్​, మ్యాస్ట్రో సహా మొత్తం 10 మోడళ్లను బీఎస్​-6 వేరియంట్లలో అందుబాటులోకి తేనున్నట్లు హీరో మోటార్స్​ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ సంస్థ తొలి బీఎస్​-6 ఉద్గార నియమాలు పాటించే బైక్​.. 'స్ల్పెండర్​ ఐ స్మార్ట్​' విక్రయాలను నవంబర్​ నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:నవంబర్​లో మూడేళ్ల గరిష్ఠానికి చిల్లర​ ద్రవ్యోల్బణం

ABOUT THE AUTHOR

...view details