తెలంగాణ

telangana

ETV Bharat / business

2020లో కొత్త ఉద్యోగాలు కష్టమే..! - ఉద్యోగాలు రావడం కష్టమే

వచ్చే ఏడాది దేశంలో ఉద్యోగ కల్పన స్తబ్తుగా కొనసాగొచ్చని పలు నివేదికలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో వేతనాల పెంపు, కొత్త ఉద్యోగాల సృష్టిపై కంపెనీలు ఆసక్తి చూపకపోవచ్చని చెబుతున్నాయి. ఈ నివేదికలు పేర్కొన్న మరిన్ని కీలక అంశాలు మీ కోసం.

JOBS
కొత్త ఉద్యోగాలు కష్టమే

By

Published : Dec 23, 2019, 7:05 AM IST

దేశంలో ఈ ఏడాది నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా 2020లో ఉద్యోగకల్పన స్తబ్తుగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. చాలా కంపెనీలు ఉద్యోగుల సంఖ్య, పాత ఉద్యోగుల వేతనాల పెంపును పక్కన పెట్టే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు బదులు.. ఉన్న వాళ్లకే నైపుణ్యాలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

"2020లో ఉద్యోగకల్పన స్తుబ్తుగా గానీ.. స్వల్పంగా పెరిగే అవకాశముందని మేం భావిస్తున్నాం. ఆర్థిక వృద్ధి పుంజుకోవడం సహా వినియోగం, పెట్టుబడులు పెరగటం వంటివి జరిగితే ఉద్యోగ కల్పనలో స్వల్ప వృద్ధి నమోదయ్యే అవకాశముంది." - రీతూపర్ణ చక్రవర్తి, ఇండియన్​ స్టాఫింగ్ ఫెడరేషన్​ అధ్యక్షులు

ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో 2020 తొలి త్రైమాసికంలో కంపెనీలు వారి వ్యాపారాల విస్తరణకు పెద్దగా మొగ్గు చూపడంలేదని గ్లోబల్​హంట్​ ఇండియా ఎండీ సునీల్​ గోయల్ అంటున్నారు.

అయితే 2020 రెండో అర్ధభాగంలో మాత్రం కంపెనీలు వాటి విస్తరణపై దృష్టి సారించే అవకాశముందని.. ఫలితంగా ఉద్యోగ కల్పన పెరిగే అవకాశముందని అయన అంచనా వేశారు.

కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం తగ్గించి.. ఉన్న వాళ్లకే సంస్థ అవసరాల మేరకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రిన్సిపల్​-ఇండియా ప్రోడక్ట్స్​ లీడర్​ నిర్మలా భరద్వాజ్ తెలిపారు.

వేతనలూ స్తబ్తుగా ఉండొచ్చు..

పలు మానవ వనరుల సంస్థలు​, నిపుణుల ప్రకారం ఇప్పటికే ఉన్న ఉద్యోగుల వేతనాల పెంపు స్తబ్తుగా ఉండొచ్చని తెలుస్తోంది. అధిక నైపుణ్యాలు ఉన్న వారికి కూడా వేతనాల పెంపు సాధారణంగానే కొనసాగనున్నట్లు అంచనా.

విల్లీస్ టవర్స్ వాట్సన్​.. 2019 క్యూ3 శాలరీ బడ్జెట్ ప్లానింగ్ నివేదిక ప్రకారం.. 2020లో అధిక నైపుణ్యాలు ఉన్న వారికి 10 శాతం మేర వేతనాలు పెరిగే అవకాశముంది. 2019లో ఉన్న 9.9 శాతం కన్నా ఇది స్వల్పంగా ఎక్కువ.

అయితే అనలైటిక్స్​ సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే వేతనాలు ఎక్కువ పెరిగే అవకాశముందని, ఆటోమేషన్​తో భర్తీ చేయగల ఉద్యోగాలకు 8-9 శాతం లోపే వేతనాల పెంపు ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది.

ఉద్యోగకల్పన తగ్గే రంగాలు ఇవే..!

రంగాల వారీగా చూస్తే.. విద్య, వాహన, లాజిస్టిక్స్​, రియల్టీ రంగాల్లో ఉద్యోగకల్పన భారీగా తగ్గే అవకాశముందని నివేదికల అంచనా. ఇందుకు నెమ్మదించిన వృద్ధి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అయితే.. సమాచార సాంకేతిక, బ్యాంకింగ్​, ఈ-కామర్స్, సేవా రంగాల్లో ఉద్యోగ కల్పన కాస్త సానుకూలంగా ఉండొచ్చని నివేదికలు పేర్కొన్నాయి.

2019లో..

2019లో అధికంగా అటోమేషన్​, కృత్రిమ మేధ రంగాల్లో కొత్త తరం వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఏడాది టెలికాం రంగంలో 35 శాతం ఉద్యోగకల్పన పుంజుకున్నట్లు మోన్​స్టర్​ డాట్​కామ్ సీఈఓ, గల్ఫ్​ క్రిష్ణ తెలిపారు. భారత్​లో 5జీ సాంకేతికత కోసం టెలికాం సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నందున ఈ స్థాయిలో ఉద్యోగకల్పన పుంజుకున్నట్లు అభిప్రాయపడ్డారు. టెలికాం రంగం తర్వాత ఆతిథ్య, ట్రావెల్ రంగాల్లో 12 శాతం ఉద్యోగకల్పన పెరిగినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:పాన్​-ఆధార్​ అనుసంధానానికి గడువు దగ్గరపడింది!

ABOUT THE AUTHOR

...view details