తెలంగాణ

telangana

ETV Bharat / business

100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

100 బిలియన్​ డాలర్ల మార్కెట్​ క్యాపిటల్ క్లబ్​లో చేరిన తొలి భారతీయ బ్యాంకుగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రికార్డు సాధించింది. దేశీయ కంపెనీల పరంగా చూస్తే.. 100 బిలియన్ డాలర్ల మార్కెట్​ విలువ కలిగిన మూడో సంస్థ ఇదే కావడం గమనార్హం.

HDFC BANK
100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాాంక్​

By

Published : Dec 19, 2019, 3:18 PM IST

Updated : Dec 19, 2019, 3:38 PM IST

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. భారత్‌లో ఈ మైలురాయిని చేరుకొన్న మూడో కంపెనీ ఇదే కావడం విశేషం. దేశీయ మారకంలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ విలువ ప్రస్తుతం రూ.7,07,664.94 కోట్ల వద్ద ఉంది. బ్యాంకుల పరంగా చూస్తే ఈ మార్క్​ను అందుకున్న తొలి భారతీయ కంపెనీ ఇదే కావడం మరో విశేషం.

తొలి రెండు స్థానాల్లో..

ఈ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీస్​(టీసీఎస్​)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వీటి మార్కెట్​ క్యాపిటల్​ విలువలు వరుసగా దాదాపు 140 బిలియన్​ డాలర్లు (రూ.10,17,125.54 కోట్లు), 114.60 బిలియన్​ డాలర్లు (రూ.8,31,134.45 కోట్లు)గా ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 110వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో 109 కంపెనీలు 100 బిలియన్‌ డాలర్లను దాటాయి. ఇక 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను దాటిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 26వ స్థానంలో ఉంది.

ఇదీ చూడండి:లాటరీలపై 28శాతం పన్ను విధింపు: జీఎస్టీ మండలి

Last Updated : Dec 19, 2019, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details