తెలంగాణ

telangana

By

Published : Jan 15, 2021, 10:33 AM IST

ETV Bharat / business

క్యూ3లో హెచ్​సీఎల్​టెక్ జోరు- లాభం 31శాతం వృద్ధి

ఐటీ దిగ్గజం హెచ్​సీఎల్​ఎల్​టెక్​ 2020-21 క్యూ3లో నికర లాభం రూ.31 శాతం పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ.3,982 కోట్లు గడించినట్లు ప్రకటించింది. ఆదాయం కూడా 6.4 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది.

hcl tech profit in q3
భారీగా పెరిగిన హెచ్​సీఎల్​టెక్ నికర లాభం

దేశీయ ఐటీ దిగ్గజం హెచ్​సీఎల్​టెక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,982 కోట్ల నికర లాభాన్ని గడించినట్లు శుక్రవారం ప్రకటించింది. 2019-20 క్యూ3లో నమోదైన రూ.3,037 కోట్ల లాభంతో పోలిస్తే.. ఇది 31.1 శాతం ఎక్కువ.

2020-21 క్యూ3లో ఆదాయం కూడా 6.4 శాతం పెరిగి..రూ.19,302 కోట్లుగా నమోదైనట్లు హెచ్​సీఎల్​టెక్ వెల్లడిచింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆదాయం రూ.18,135 కోట్లుగా ఉన్నట్లు వివరించిది.

క్యూ3లో లాభాలు పెరిగిన నేపథ్యంలో.. చివరి త్రైమాసిక ఆదాయపు అంచనాలను ఎగువకు సవరించింది హెచ్​సీఎల్​టెక్​. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఆదాయం 2% నుంచి 3% వరకు వృద్ధి చెందొచ్చని పేర్కొంది. ఇంతకు ముందు ఈ అంచనాలు 1.5%-2.5 % గా ఉన్నాయి.

ఇదీ చూడండి:ఇక ల్యాండ్​లైన్ నుంచి​ కాల్​ చేస్తే '0' తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details