తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫ్యూచర్'​తో వివాదంలో అమెజాన్​కు ఊరట

ఫ్యూచర్​ రిటైల్​తో ఏర్పడిన వివాదంలో ఈ కామర్స్ సంస్థ అమెజాన్​కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. రిజర్వు చేసిన తీర్పు వెలువరించే వరకు రిలయన్స్ రిటైల్​తో ఒప్పందం విషయంలో యథాపూర్వ స్థితిని కొనసాగించాలని ఫ్యూచర్ రిటైల్​ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు.

Interim relief to Amazon in Future Group dispute
ఫ్యూచర్​ గ్రూప్ వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు

By

Published : Feb 2, 2021, 7:30 PM IST

రిలయన్స్​ రిటైల్​కు ఫ్యూచర్​ రిటైల్ విక్రయించేందుకు కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంపై దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఫ్యూచర్ రిటైల్ యథాఫూర్వ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇరు సంస్థల ఒప్పందానికి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం.

రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్​ రిటైల్ మధ్య ఒప్పందం విషయంలో తమ హక్కులు పరిరక్షించేందుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అమెజాన్ కోర్టును ఆశ్రయించింది. అమెజాన్​ వాదన సంతృప్తికరంగా ఉందని జస్టిస్ జేఆర్ మిదా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు రిజర్వు చేసిన తీర్పు వెలువరించే వరకు యథాపూర్వ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

ఫ్యూచర్ గ్రూప్‌ ఒప్పందంపై సింగపూర్‌కు చెందిన ఏకసభ్య జడ్జి ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ స్టేను ఆధారంగా చేసుకుని దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది అమెజాన్. ఇందులో కిశోర్​ బియానీ ఆధీనంలోని ఫ్యూచర్ రిటైల్​ను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్​ రిటైల్​కు విక్రయించే ప్రక్రియ పూర్తవకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరింది.

ఇదీ చూడండి:సొంత క్రిప్టో కరెన్సీపై ఆర్థిక శాఖ స్పష్టత

ABOUT THE AUTHOR

...view details