ఎయిర్ఇండియాలో వాటా కొనుగోలుపై ఆసక్తి లేదని ఖతర్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ సీఈఓ అక్బర్ అల్ బాకర్ అధికారిక ప్రకటన చేశారు.
ప్రభుత్వాధినంలోని ఎయిర్ఇండియాలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్ ఇండియాలో వాటాలు కొనుగోలు చేయాలని సింగపూర్, లండన్లలో రోడ్ షోలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వాటా కొనుగోలుపై ఆసక్తిలేదని ఖతర్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గట్టెక్కించేందుకు సంస్థలో వాటాను విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.