లగ్జరీ బైక్‌లు అనగానే భారత్‌లో ఎక్కువగా గుర్తొచ్చే పేరు హార్లీ డేవిడ్సన్. అంతలా దేశీయ మార్కెట్లో పేరు తెచ్చుకున్న హార్లీ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనాతో విధించిన లాక్డౌన్ సహా.. డిమాండ్ లేమితో ఇటీవల బైక్‌ల విక్రయాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాల నుంచి వైదొలగాలని హార్లీ డేవిడ్సన్ భావిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్ అంచనాలు కూడా ఆశించినంతగా లేకపోవడం ఇందుకు కారణమనే వార్తలు వస్తున్నాయి.
కంపెనీకి హరియాణాలో ఉన్న ప్లాంట్‌ను మూసేసి.. ఔట్ సోర్సింగ్‌కు అసెంబ్లింగ్ విభాగ కార్యకాలాపాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.