అమెరికాకు చెందిన ప్రముఖ లగ్జరీ బైక్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ భారత్లో ప్రస్తుత బిజినెస్ మోడల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
బవాల్ (హరియాణా)లో కంపెనీకి ఉన్న ఫ్యాక్టరీని మూసివేసేయడం, గురుగ్రామ్ విక్రయ కేంద్రంలో అమ్మకాల తగ్గింపు ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీకి చెందిన ఓ వ్యక్తి తెలిపారు.
విక్రయాలు క్షీణించడం సహా ఇతర కారణాలతో పలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా గత కొన్నాళ్లుగా హార్లీ కార్యకలాపాలను విరమించుకుంటూ వస్తుండటం గమనార్హం.